రేపు మధిరలో పర్యటించనున్న DY.CM భట్టి
KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం మధిరలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు మధిర మున్సిపాలిటీ డెవలప్ మెంట్ రివ్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అధికారులతో సమావేశమై సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు.