నాటి 'చితిలాపురం'... నేటి 'చిట్యాల'
NLG: చిట్యాల మున్సిపాలిటీకి ఘనమైన చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో దీనిని 'చిత్తాల సంగ్యపురం' అని పిలిచేవారు. స్మశాన వాటికల వల్ల 'చితిలాపురం'గా మారి, కాలక్రమేణా చిట్యాలగా స్థిరపడిందని భావిస్తున్నారు. 1984లో రైల్వే పనుల్లో లభించిన శిలాశాసనం ప్రకారం.. క్రీ.శ. 1257లో బెంగాల్ నుంచి వలస వచ్చిన కాయస్థ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు ఆధారాలు ఉన్నాయి.