సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ నియోజకవర్గంలో 61 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే విజయుడు శనివారం పంపిణీ చేశారు. మొత్తం రూ.14,81,500 విలువైన ఈ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.