రంజిత్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
TG: చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కుటుంబాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి మరణించడంతో ఆయన వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన కేటీఆర్, ఆయన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.