'9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు'
కృష్ణా: ఉయ్యూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ టీడీపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదవారికి గూడు, గుడ్డ అందాలనే నినాదంతో టీడీపీని స్థాపించారని అన్నారు. ఆయన పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు.