VIDEO: షూలో నాగుపాము

VZM: ఎస్.కోటలోని బర్మా కాలనీలో నాగుపాము హల్‌చల్ చేసింది. ఇంట్లో వాళ్లు ఉదయాన్నే బయటకు రాగా బుస బుసమంటూ శబ్ధం రావడం గమనించారు. ఏంటని చూడగా 'షూ' లో నాగుపాము ఉంది. వీరిని చూడగానే అది బుసలు కొడుతూ రెచ్చిపోయింది. దీంతో హడలిపోయిన కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతడు పామును పట్టుకుని అటవీ ప్రాతంలో విడిచిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.