భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో భక్తుల రద్దీ పెరిగంది. ఇవాళ కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.