'ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచాలి'

VSP: ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచాలని విశాఖ నగరం వాల్తేరు డిపో వద్ద డ్రైవర్లు సోమవారం ధర్నా చేశారు. డిపో సీఐటీయూ కార్యదర్శి వెంకట్రావు మాట్లాడుతూ.. వీరి జీతాల అగ్రిమెంట్ పూర్తై 11 నెలలు కావస్తుందని ఇప్పటివరకు డ్రైవర్లకు బస్సు యాజమాన్యాలు జీతాలు పెంచకపోవడం శోచనీయం అన్నారు. చాలీచాలని వేతనాలతో డ్రైవర్లు అప్పుల పాలు అవుతున్నారని అన్నారు.