తల్లయిన బ్లూ డ్రమ్ నిందితురాలు
యూపీ మీరట్‌లో బ్లూ డ్రమ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలైన ముస్కాన్ తల్లయింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆమెకు నవంబర్ 24న పురిటి నొప్పులు రావడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సాధారణ ప్రసవం చేయగా.. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, బిడ్డ పుట్టిన రోజు, మాజీ భర్త జయంతి ఒకే రోజు కావటం విశేషం.