'రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి'

'రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి'

KMM: కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని కూసుమంచి ఏవో వాణి కోరారు. ఈ ఏడాది జూన్ 5లోగా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఇందుకు అర్హులన్నారు. రైతుల వయస్సు 59 ఏళ్ల లోపు ఉండాలని, దరఖాస్తు చేసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఈనెల 13లోగా అందజేయాలన్నారు.