'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PDPL: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ సూచించారు. శనివారం మండలంలోని పెద్దంపేట, రాయదండి పరిసర గ్రామాల్లోని చెరువులు, వాగులను ఆయన పరిశీలించారు. వీటికి సమీపంలోని గ్రామస్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాగులు దాటడం, చేపల కోసం వెళ్లడం వంటివి చేయకూడదని కోరారు.