'అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం'
VZM: అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన అవసరమని గజపతినగరం అగ్నిమాపకేంద్రం అధికారి MSV రవి ప్రసాద్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ గజపతినగరం జాతీయ రహదారిపై అలాగే రైల్వే స్టేషన్‌లో కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ప్రమాదాలు సంభవించేటప్పుడు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టలో సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపు సిబ్బంది పాల్గొన్నారు.