కేసముద్రం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

కేసముద్రం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రామనాథ కేకన్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు ఆయుధాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. రోజువారీగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఇందులో స్థానిక డీఎస్పీ తిరుపతి రావు పాల్గొన్నారు.