శిథిలావస్థలో భీమేశ్వరాలయ కోనేటి మండపం
KKD: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేటి మండపం శిథిలావస్థకు చేరుకుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిరక్షణ బాధ్యతను పురావస్తు శాఖ నిర్వహిస్తున్నప్పటికీ, నిర్వహణ లోపంతో మండపం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సత్వరమే మరమ్మతు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.