సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

ASR: ముంచంగిపుట్టు మండలంలోని కర్రిముకిపుట్టు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. సచివాలయంలో సమయానికి సిబ్బంది హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.