ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

కడప జిల్లా పెనగలూరులోని వి.యం పురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.