మైనర్ల SM ఖాతాల నిషేధానికి టైం ఫిక్స్
ఆస్ట్రేలియాలో కీలక చట్టాన్ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ చేసిన చట్టాన్ని ఈ నెల 10 నుంచి అమలు చేయనుంది. దీంతో ఇకపై వేలాది మంది టీనేజర్ల సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వం బలవంతంగా తొలగించనుంది. తాజా నిబంధనలకు విరుద్ధంగా సామాజిక మాధ్యమ వేదికలు వ్యవహరిస్తే వాటిపై భారీ జరిమానాలను విధించనుంది.