నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన వివరాలు

KMM: ఎర్రుపాలెం మండలంలో Dy.CM భట్టివిక్రమార్క మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బుచ్చిరెడ్డిపాలెం, బనిగండ్లపాడు, అయ్యవారిగూడెంలో నిర్మించే రహదారులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, బీమవరంలో రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.