కనిగిరిలో విద్యార్థులకు ‘ముస్తాబు’ కార్యక్రమంపై అవగాహన
ప్రకాశం: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కనిగిరి సెంట్ జెఎక్స్ స్కూల్లో విద్యార్థులకు ‘ముస్తాబు’ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ కఫార్ తెలిపారు. చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించారు.