'సమస్యల పరిష్కారానికే స్వామిత్వ పథకం'
ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరులో గురువారం స్వామిత్వ గ్రామసభ నిర్వహించారు. గ్రామాల్లో భూ సమస్యలకు స్వామిత్వ పథకమే పరిష్కారమని పంచాయతీ కార్యదర్శి కొండయ్య తెలిపారు. డ్రోన్ ద్వారా సర్వేచేసి పొజిషన్ మ్యాప్, డేటా తయారు చేస్తారని పేర్కొన్నారు. సర్వే వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేసి వాటిని సరిచేసుకోవచ్చన్నారు. ఖాళీ స్థలాలు, ఇండ్లను రికార్డు చేస్తారని వారికి తెలిపారు.