రేపు కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు నిరాహార దీక్ష

రేపు కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు నిరాహార దీక్ష

కోనసీమ: రేపు ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్ష చేయనున్నారు. ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టనున్నామని అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.