భక్తాంజనేయ స్వామి వారి జాతరలో ఎమ్మెల్యే

EG: అనపర్తి మండలం కుతుకులూరు భక్తాంజనేయ స్వామి వారి జాతర, తీర్థ మహోత్సవాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఉత్సవాలకు ఆలయ ప్రాంగణంలో పందిరి రాటను ప్రతిష్టించారు. ప్రతి ఏటా సంక్రాంతిని పురస్కరించుకొని జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.