జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష
PDPL: జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృత సమీక్ష సమవేశం నిర్వహించారు. నవజాత శిశువుల వారోత్సవాలు, వెసెక్టమీ పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. క్షయ నిర్ధారణ, జ్వరాల సర్వే, డ్రై డే కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఓపీ కేసులు, సిబ్బంది సమయపాలన ఉండాలన్నారు.