కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
MHBD: తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్, 8వ వార్డు అధ్యక్షులు భూక్య సాగర్ సహా పలువురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.