కంది వలస సమీపంలో ఏనుగుల గుంపు

కంది వలస సమీపంలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం కందివలస గ్రామ సమీపంలో ఉన్న మెట్టపై ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. శనివారం ఉదయం ఈ మెట్ట పైకి వచ్చిన ఏనుగులు ఏ క్షణానైనా పంట పొలాలలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పంట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు.