జన గణన ట్రైనింగ్ పరిశీలించిన జోనల్ కమిషనర్
MDCL: మేడ్చల్ పరిధిలో జనగణనకు రంగం సిద్ధమవుతుంది. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, ఐఏఎస్ చౌదరి కలిసి నేడు ఉప్పల్, నాచారం, కాప్రా సర్కిళ్లలో కొనసాగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. శిక్షణ కేంద్రాలను సందర్శించి ఎన్యూమరేటర్లతో మాట్లాడి వారి అవగాహన స్థాయిని పరిశీలించారు. డేటా సేకరణలో ఖచ్చితత్వం కీలకమని పేర్కొన్నారు.