ఇరాన్ దాడులపై స్పందించేందుకు సిద్ధమన్న సౌదీ
ప్రతీకార దాడుల్లో భాగంగా సౌదీ అరేబియాపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులపై స్పందించేందుకు సౌదీ సిద్ధంగా ఉందని వెల్లడించింది. తమ ప్రజల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇరాన్ దాడులతో ఇబ్బందిపడుతున్న దేశాలకు సౌదీ సంఘీభావం తెలిపింది.