VIDEO: జిల్లాలో తీవ్రంగా పెరిగిన చలి
ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా గణనీయంగా పెరగడంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. జిల్లాలోని సిర్పూర్(యూ)లో 7.9°C, తిర్యాణిలో 8.9°C, కెరమెరిలో 9.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ మండలాల్లో చలి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు చలి మంటలు కాచుకుంటున్నారు. మరికొందరు స్వెటర్లు ధరిస్తున్నారు. వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, వెచ్చగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.