మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

KRNL: కోడుమూరులో 30 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఓ మైనర్ బాలిక ఇంట్లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోక్సో కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ వివరాలను ఎస్సై ఎర్రిస్వామి బుధవారం వెల్లడించారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దుశ్చర్య జరిగింది.