టేకుమట్లలో CM దిష్టిబొమ్మ దహనం
BHPL: టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో BJP శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మండల పోలీసులు, దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నాగరాజు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు సరికాదని, ప్రభుత్వం పథకాల అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.