VIDEO: 'ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. పట్టించుకోని అధికారులు'

ADB: లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీ గ్రామంలోని ఎస్సి కాలనీలో విద్యుత్ స్తంభాల యొక్క విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారి జనజీవనానికి ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇదే విషయమై గత 3సంవత్సరాల నుండి విద్యుత్ అధికారులకు విన్నవించినప్పటికీ, ఫలితం శూన్యమని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీగలను సరిచేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.