నేడు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్ష సూచన
ప్రకాశం: దక్షిణ అండమాన్‌లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.