VIDEO: 'సమిష్టి కృషితో కాంగ్రెస్‌ని బలోపేతం చేద్దాం'
ఆదిలాబాద్‌లోని టీఎన్జీవోస్ భవనంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ నేతలందరి సమిష్టి కృషితో జిల్లాలో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు, తదితరులు పాల్గొన్నారు.