సిఖ్ విలేజ్‌లో MLA ఆధ్వర్యంలో మీటింగ్

HYD: సిఖ్ విలేజ్ డైమండ్ పాయింట్ గాయత్రి గార్డెన్స్‌లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది జాతిపిత మహాత్ముడని గుర్తు చేశారు. అదేవిధంగా దేశంలో స్వపరిపాలన కోసం రాజ్యాంగాన్ని అందించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.