ఉదృతంగా ప్రవహిస్తున్న ఎత్తిపోతల జలపాతం
NLG: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో సాగర్ సమీపంలోని ఎత్తిపోతల జలపాతం మళ్లీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం, నల్లమల అటవీ సోయగాలతో నయాగారను తలపిస్తోంది. ఆలస్యంగా వచ్చిన వరద నీటితో కొత్త అందాన్ని సంతరించుకున్న ఈ ప్రదేశాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.