తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు
SKLM: నరసన్నపేట (M) జమ్మూ పంచాయతీ పరిధిలోని గడ్డియ్య పేట వద్ద నిర్మించిన జగనన్న కాలనీలో నివాసితులు తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం స్థానికులు మాట్లాడుతూ.. కాలనీకి ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం శిథిలావస్థకు చేరుకుందని దాని నుంచి తాగునీరు కూడా అందడం లేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.