CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: పేదలకు సంజీవని సీఎం సహాయ నిధి అని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి కోటలో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బొబ్బిలి మండలం చింతాడకు చెందిన ఉర్లాపు రవికు రూ. 40వేలు, రామభద్రపురం మండలం తారాపురానికి చెందిన కొంపంగి చరణ్ తేజకు రూ. 40వేలు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.