జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసాలు
ASF: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సైబర్ మోసగాళ్లు వినూత్న పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కాగజ్ నగర్‌లో క్రెడిట్ కార్డుకు సంబంధించిన నకిలీ కాల్స్ ద్వారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 90 వేలు, ఒక ఉద్యోగి నుంచి రూ.70 వేలు కొట్టేశారు.