గురుకుల కళాశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

గురుకుల కళాశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

హనుమకొండ జిల్లా దామెర మండలం ఓ గ్లాపూర్ గ్రామంలో ఉన్న ఎం జె పి, మైనార్టీ, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇవాళ సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల కళాశాలల వంటశాలలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు అందించాలని ఆదేశించారు.