VIDEO: పహల్‌గామ్ ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో పహల్ గామ్ దాడికి వ్యతిరేకంగా మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మానవత్వానికి మచ్చ తెచ్చేలా పర్యాటకులపై దాడి చేయడం సిగ్గుచేటు అని అన్నారు.