నిరంతరం కృషి చేసుకుంటూ వెళ్తా: రఘునందన్

HYD: టుబాకో కంట్రోల్ హీరో అవార్డ్ పొందటం సంతోషంగా ఉందని, HYD పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ DT రఘునందన్ అన్నారు. వైద్య నిపుణులు, అనుభవజ్ఞులైన వారి చేత ఎంపిక చేయబడిన ఈ అవార్డు సాధించడం నిజంగా గొప్ప విషయం అని పేర్కొన్నారు. సౌత్ నుంచి ఎవరికైనా ఇస్తారా..? అన్న సందేహాల మధ్య, 22 ఏళ్లుగా నిస్వార్థ కృషి, తపన, సేవాభావం బలంగా నిలిచాయని చెప్పుకొచ్చారు.