డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలి

డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలి

KMM: కల్లూరు మండల కేంద్రంలోని, అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాల ఎదుట డ్రైనేజీ కాలువ చెత్తా చెదారంతో పేరుకుపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమలు ఆవాసం చేసుకోవడంతో పిల్లలు అనారోగ్యల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలో చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.