వంతెనను నిర్మించండి సారూ..!
MDK: మక్తభూపతిపూర్ నుంచి మెదక్ వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారినట్లు స్థానికులు తెలిపారు. గత భారీ వర్షాల కారణంగా పుష్పాల వాగు వంతెన తెగిపోయింది. దీంతో ఆ సమయంలో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేయగా, రక్షణ దిమ్మెలు లేకపోవడంతో వాహదారులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.