ముగిసిన యాదగిరిగుట్ట బ్రహ్మొత్సవాలు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మొత్సవాలు నిన్నటితో ముగిశాయి. ప్రధాన ఆలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి వేదపండితులు మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, ఎండోమెంట్ డైరక్టర్ హనమంత రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహి తదితరులు పాల్గొన్నారు.