పైరసీపై RGV కామెంట్స్.. వీడియో వైరల్
iBOMMA రవి అరెస్ట్ వేళ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాత వీడియో వైరల్ అవుతోంది. 'నేనూ పైరసీ చూస్తా.. టెక్నాలజీ ఉన్నంత వరకు దీన్ని ఎవరూ ఆపలేరు' అని వర్మ తేల్చిచెప్పారు. 'నిర్మాతలు, హీరోల లాభాల కోసం జనం ఎక్కువ డబ్బులెందుకు తగలేస్తారు? వాళ్లకు కావాల్సింది తక్కువ ఖర్చులో వినోదం' అని అభిప్రాయపడ్డారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు RGV మాటలకు, రవికి సపోర్ట్ చేస్తున్నారు.