రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగామ వద్ద గల గోల్డెన్ ఫంక్షన్ హాల్ ముందు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిర్మల్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని కింద పడటంతో మంజులాపూర్‌కు చెందిన సృజన్ (33), నటరాజ్ నగర్‌కు చెందిన ప్రపూల్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.