'కేజీబీవీలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి'
SRD: కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని సోమవారం మండల విద్యాధికారి రహీముద్దిన్ తనిఖీ చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సందర్శించి ఈ మేరకు స్థానిక పరిసరాలు, పారిశుద్యం నిర్వహణ పరిశీలించారు. అనంతం కిచెన్‌లో సరుకులు, కూరగాయలు, వంటకాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక స్పెషలాఫీసర్ విజయలక్ష్మితో సమావేశమై సమీక్షించారు.