గిరిజనుల భూములను కాపాడాలి

SKLM: హిరమండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా నాయకులు సిర్ల ప్రసాద్ సోమవారం గిరిజనులతో కలిసి ధర్నా నిర్వహించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములను కాపాడాలని, గిరిజనుల భూములను గిరిజనేతర్లు ఆక్రమించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు.