'రేపు సాయంత్రానికి రెండో దశ ప్రచారం ముగింపు'
MLG: రెండవ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లో రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. నిబంధన ప్రకారం ఆ తర్వాత మైక్‌లను బంద్ చేయాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర్ హెచ్చరించారు. మద్యం, కళ్లు దుకాణాలను మూసి వేయాలని అధికారులను ఆదేశించారు.