'పింఛన్ల రద్దుపై కోర్టును ఆశ్రయిస్తాం'

VZM: రద్దు చేసిన దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం తక్షణమే పునరుద్దరించాలని విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. గురువారం MPDO కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. మండలంలో సుమారు 216 పింఛన్లు రద్దు చేశారన్నారు. ఈ నెల 25లోగా MPDO కార్యాలయాల్లో పునరుద్దరణ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.